
జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ రాయచోటి నియోజక వర్గం కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీ నీవా కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు, శ్రీనివాస రిజర్వాయర్, ఝరికోన కాలువ పనులు పూర్తి చేసి రైతులకు తాగునీరు, సాగునీరు అందించాలని కోరారు. పీలేరు కార్యదర్శి వెంకటేష్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి జగన్ బాబు, రైతు సంఘం నియోజక వర్గం అధ్యక్షుడు హరినాథ నాయుడు, అంజాద్ అలీఖాన్ పాల్గొన్నారు.