
ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆదివారం కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో కడప, చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కడప జట్టు 89.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. ఆ జట్టులోని నాగ కుళ్లాయప్ప 182 బంతుల్లో 17 ఫోర్లతో 101 పరుగులు చేసి అద్భుతంగా ఆడారు. సాయి ఆర్దిత్ 60 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. ధనుష్ 2, తేజేష్ 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీసీ స్టేడియంలో..
అదే విధంగా వైఎస్‌ఆర్‌ఆర్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌లో నెల్లూరు, కర్నూలు జట్లు తలపడ్డాయి, ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. ఆ జట్టులోని మన్విత్‌రెడ్డి 87 బంతుల్లో 86, కారుణ్య ప్రసాద్ 78, చైతన్య తేజ 62 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని రేవంత్ 2 వికెట్లు తీశాడు.

ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు ప్రారంభం

ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు ప్రారంభం

ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు ప్రారంభం