
మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి
రాజంపేట రూరల్ : మామిడికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్‌కు శనివారం మామిడిని సాగు చేసే రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎంతో నష్టపోయామని వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉండాల్సింది పోయి వారిని నట్టేట ముంచుతోందని మండిపడ్డారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కూడా రైతులకు అండగా ఉంటూ వారని అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. నేడు కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేసి దోచుకుంటోందని ధ్వజమెత్తారు. రైతులను విస్మరిస్తే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి