
జిల్లా జట్టుకు ఎంపిక
నందలూరు : అండర్–19 బాలికల విభాగంలో సీఏవైడీ కడప జిల్లా క్రికెట్ జట్టుకు రాజంపేటకు చెందిన కేంద్రీయ విద్యాలయం విద్యార్థిని మోహనవైష్ణవి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా, రిషిత మీడియం ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఎంపికై నట్లు సబ్ సెంటర్ కోచ్‌లు గయాజ్, ఫిరోజ్ ఖాన్ లోడీలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికయ్యేలా శిక్షణ ఇచ్చిన ట్రైనర్ శివకోటి, పీఈటీ రాహుల్, కోచ్‌లు, సీఏవైడీ ప్రెసిడెంట్ భరత్‌రెడ్డి, సెక్రటరీ రెడ్డిప్రసాద్, డీసీఓ ఖాజామైనుద్దీన్, ఉమెన్ క్రికెట్ కోఆర్డినేటర్ విష్ణుమోహన్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
టిప్పర్ ఢీకొని తీవ్ర గాయాలు
ముద్దనూరు : స్థానిక కొత్త బస్టాండు సమీపంలో శనివారం టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పవన్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి కడప రహదారిలో వెళ్తుండగా కొత్త బస్టాండు వైపు నుంచి వస్తున్న ఓ టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో పవన్‌కు కాలు విరగడంతో పాటు గాయాలయ్యాయి.

జిల్లా జట్టుకు ఎంపిక