
తొలి అవకాశాన్ని వదులుకోవద్దు
రాజంపేట టౌన్: చదువుకున్న వ్యక్తి జీవితంలో స్థిరపడాలంటే ఉద్యోగం తప్పని సరి అని తొలిసారిగా వచ్చే ఉద్యోగ అవకాశాలను ఎవరు కూడా వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్ సిహెచ్.రామ్మూర్తి తెలిపారు. రాజంపేటలోని ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం నిర్వహించి జాబ్‌మేళాలో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా వెనకబడిన వారు త్వరగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలన్న లక్ష్యంతో ఐటీఐ కోర్సును పూర్తి చేస్తారన్నారు. అభ్యర్థులు తమ ముంగిటికే వచ్చిన ఉద్యోగ అవకాశాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఇటీవలే ఐటీఐ పూర్తి చేసిన వారికి, ఐటీఐ పరీక్షలు రాయబోయే విద్యార్థులను ఏ కంపెనీ కూడా తమ అనుభవం గురించి అడగదన్నారు. జాబ్ మేళా లో వివిధ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయన్నారు. అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలన్నారు. జాబ్‌మేళాలో ఎల్‌అండ్‌డీ కంపెనీ ప్రతినిధి ప్రమోద్, యాంత్రిక పవర్ సూల్యూషన్ ప్రతినిధి హర్ష, జేవై సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రతినిధి కార్తీక్ కుమార్, టాఫే కంపెనీ ప్రతినిధి సికిందర్ పాల్గొన్నారు.