
సూక్ష్మంలో మోక్షం
యోగాతో శరీరంలో జాయింట్స్ కదులుతాయి. సూక్ష్మంలో మోక్షం లాంటిది. కండరాల దృఢత్వం, నాడీ వ్యవస్థ చైతన్యంగా మారుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగా సాధకులు, అభ్యాసకులు పది మందిలో ప్రత్యేకంగా కన్పిస్తారు. తనకున్న ఆరోగ్య సమస్యలు నియంత్రణలో ఉన్నాయి.
– సురేష్, సివిల్ ఇంజినీరు
ఆన్‌లైన్‌లో నేర్చుకున్నా
వివిధ రోగాల నియంత్రణలో యోగా దివ్య ఔషదం. నేను ఆస్ట్రేలియాలో పని చేస్తున్నా. మూడేళ్లుగా ఆన్‌లైన్ ద్వారా యోగాసనాలు చేస్తున్నా. ప్రస్తుత రోజుల్లో రోగం వస్తే డాక్టర్లు, ఆసుపత్రుల వైపు చూస్తున్నారే గాని యోగా తదితర వ్యాయామాలు ఉన్నాయన్న సంగతినే మరచిపోతున్నారు. యోగాతో వ్యాధులు నియంత్రణలో ఉంటాయని గుర్తించా.
– ప్రతాప్, ఆస్ట్రేలియా
విద్యార్థి స్థాయిలోనే నేర్చుకోవాలి
ప్రతి విద్యార్థి చదువు సంధ్యలతో పాటు యోగా విధిగా నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. చిన్న వయస్సులోనే వివిధ జబ్బులతో బాధపడుతున్నవారు ఎందరో. యోగా శ్వాస క్రియ ద్వారా చాలా మట్టుకు రోగాలు నియంత్రణలో ఉంటాయి. చదువుల్లో రాణించడానికి శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, జ్ణాపకశక్తి,ఏకాగ్రత ముఖ్యం.
–ఓం ప్రకాష్, యోగా సాధకులు

సూక్ష్మంలో మోక్షం

సూక్ష్మంలో మోక్షం