
బీరు బాటిళ్లతో యువకుల హల్‌చల్
మదనపల్లె రూరల్ : పట్టణంలోని నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లే అవుట్‌లోని వివేకానంద స్కూల్ సమీపంలో కొందరు యువకులు బీరు బాటిళ్లు పట్టుకుని శుక్రవారం హల్‌చల్ చేశారు. పాఠశాలకు వెళ్లే దారిలో రోడ్డుపై గొడవపడుతూ వీరంగం సృష్టించారు. అదే మార్గంలో పాదచారులు, విద్యార్థులు వెళుతున్నా లెక్కపెట్టకుండా ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకుంటూ అరుపులు, కేకలతో భయం కలిగించేలా వ్యవహరించారు. చేతిలో బీరు బాటిల్‌తో పరిగెత్తుతూ, స్థానికులను భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటనను కొందరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆకతాయిలు...మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.