
వేటగాళ్ల ఉచ్చులో పడి రైతుకు గాయాలు
మదనపల్లె రూరల్ : అటవీ జంతువుల కోసం వేటగాళ్లు పన్నిన కరెంట్ ఉచ్చులో పడి ఓ రైతు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. దిగువపల్లెకు చెందిన పెద్దిరెడ్డి కుమారుడు రైతు శ్రీనివాసులురెడ్డి(58) గురువారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లాడు. రాత్రి వేళ గమనించకుండా పొలానికి సమీపంలో వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఏర్పాటుచేసిన కరెంట్ ఉచ్చులో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పెద్దమండ్యం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

వేటగాళ్ల ఉచ్చులో పడి రైతుకు గాయాలు