
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌పై విచారణ
కలకడ : కలకడ ఆదర్శపాఠశాల ప్రిన్సిపల్ మల్లంగ్‌షా వలిపై శుక్రవారం విచారణ చేపట్టారు. మల్లంగ్‌షావలి ప్రిన్సిపల్‌గా పనిచేసిన సమయంలో విద్యార్థులకు పురుగులు పట్టిన బియ్యంతో భోజనం వండారని, ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా విద్యా శాఖ అధికారి, కడప ఆర్‌జేడీ విచారణ చేయాలని మదనపల్లె డీవైఈఓ లోకేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన విద్యార్థులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా విచారణ చేశారు. ప్రిన్సిపల్ సమాధానం తీసుకుని నివేదిక ఉన్నతాధికారులకు పంపుతామని డీవైఈఓ తెలిపారు. అనంతరం విధ్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు మునీంద్రనాయక్, వెంకట్రమణరెడ్డి, ఇన్‌చార్జి ప్రిన్సిపల్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.