విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
గాలివీడు : గాలివీడు మండలం గోరాన్ చెరువు గ్రామం ఎస్టీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వర్నెల సుబ్బమ్మ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. బాధితురాలి కథనం మేరకు.. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న టీవీ పేలి పెద్ద శబ్దం రావడంతో ఇళ్లంతా ఒక్కసారిగా దట్టమైన పొగలతో కూడిన మంటలు కమ్ముకున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపకశాఖ వారికి సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో అదృష్ట వశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లో ఉన్న రూ.20 వేల నగదు, దుస్తులు, బియ్యం, టీవీ, బీరువా పూర్తిగా కాలిపోయాయి. దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.
కరెంట్ షాక్‌తో యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : కరెంట్ షాక్‌తో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన రామసముద్రం మండలంలో జరిగింది. చెంబకూరు పంచాయతీ నారేవారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు భాస్కర (28), పొలం వద్ద టమాటా పంట కోసి, క్రేట్లలో వేసి వాహనంలో పెట్టేందుకు తీసుకు వెళుతుండగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు శరీరానికి తగిలి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. ప్రమాదంలో భాస్కర తీవ్రంగా గాయపడగా, గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బాధితుని బెంగళూరుకు తీసుకువెళ్లారు.
న్యాయం కోసం భర్త ఇంటిముందు నిరసన
వీరబల్లి : వీరబల్లి మండలం, మట్లి గ్రామం, బత్తినవాండ్లపల్లిలో భర్త మహేశ్వర్ రెడ్డి ఇంటి ముందు భార్య సౌజన్య తన బిడ్డ, కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగింది. ఆమె రాకతో ఇంటికి తాళాలు వేసి మహేశ్వర్ రెడ్డి, అతని తల్లిదండ్రులు పరారయ్యారు. వివరాలిలా.. లక్కిరెడ్డిపల్లి మండలం కస్తూరాజుగారిపల్లె గ్రామం చాగలగుట్టపల్లికి చెందిన సౌజన్య హైదరాబాదులో ఉండగా మహేశ్వర్‌రెడ్డి పరిచయమయ్యాడు. వీరు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకొని రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి పది నెలల బాబు ఉన్నాడు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఆమె భర్త ఇంటి ముందు నిరసన తెలుపుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం


