బాదుడే.. బాదుడు!
● ఫిట్‌నెస్ పేరుతో చార్జీల మోత
● వాహనదారులపై అదనపు భారం
● ఆందోళన చెందుతున్న యజమానులు
● ఇక వాహనాలు నడపలేమంటున్న వైనం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: వాహనదారులు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం ఫిట్‌నెస్ చార్జీలు పెంచింది. వైఎస్సార్ జిల్లా పరిధిలో వివిధ రకాల వాహనాలు కలిపి సుమారు లక్షకు పైగా ఉన్నాయి. ఒకవైపు బాడుగ లేక మరోవైపు డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి టైర్లు, ఇన్సూరెన్స్‌తోపాటు విడిభాగాల ధరలు కూడా కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు వాహనదారుల పరిస్థితి తయారైంది. ఆటో నుంచి లారీల వరకు ఫిట్‌నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇటు పెరిగిన ఫిట్‌నెస్ చార్జీలు అటు ఈఎంఐలు కట్టలేక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే వాహనాలు నడపలేమని చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో కడప, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో వివిధ రకాల వాహనాలు, లారీలు, టిప్పర్లు, క్రేన్లు, జేసీబీలు ఇతర ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు అధికంగా ఉన్నాయి. వాటి యజమానులకు.. పెంచిన చార్జీలు అదనపు భారం కానున్నాయి. 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒకే రకం చార్జీలు అమలు చేస్తున్నారు. లైట్ , మిడిల్ గూడ్స్ వెహికల్స్, హెవీ గూడ్స్ వెహికల్స్‌గా విభజించి ఫిట్‌నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి.
హెవీ వెహికల్స్ 10 920 1416
10–13 2360
15–20 16,520
20 ఏళ్లకు పైగా 33,040
ఎంజీవీ 10 920 1416
10–13 2360
15–20 13,334
20 ఏళ్లకు పైగా 26,668
ఆటో 15 620 944
15–20 2360
20 ఏళ్లకు పైగా 10,620
ఎల్‌జీవీ 15 820 944
15–20 10,030
20 ఏళ్లకు పైగా 20,060
చార్జీలు తగ్గించాలి
ప్రభుత్వం ఫిట్‌నెస్ చార్జీలు పెంచింది. లారీలు, ట్రాక్టర్లు, గూడ్స్ వెహికల్ యజమానులు పెంచిన చార్జీలతో ఇబ్బంది పడతారు. వాటిని తగ్గించాలి. –వేణుగోపాల్,
జిల్లా అధ్యక్షుడు, ఏఐటీయూసీ


