సౌత్‌జోన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక

Dec 20 2025 7:08 AM | Updated on Dec 20 2025 7:08 AM

సౌత్‌

సౌత్‌జోన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక

సౌత్‌జోన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక మదనపల్లె పట్టు చీరలకు జీఐ ట్యాగ్‌ కోసం దరఖాస్తు పల్స్‌ పోలియోను విజయవంతం చేయండి బ్యాంకర్లతో జాయింట్‌ కలెక్టర్‌ సమీక్ష

మదనపల్లె సిటీ: జేఎన్‌టీయూ సౌత్‌జోన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి ప్రశాంత్‌ ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం ఇంజనీరింగ్‌ కాలేజీలో జరిగిన జేఎన్‌టీయూ సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్శిటీ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ప్రతిభ కనబరిచి త్వరలో జరిగే సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపికయ్యాడు. కాలేజీలో శుక్రవారం కాలేజీ డైరెక్టర్‌ రామమోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ రాయుడు, అధ్యాపకులు అభినందించారు.

కురబలకోట: అంగళ్లులోని మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ ఎంఐటీఎస్‌–ఐపీఎఫ్‌సీ మదనపల్లె మద్దతుతో మదనపల్లె పట్టు –పట్టు చీరల కోసం భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌ కోసం దరఖాస్తు సమర్పించినట్లు యూనివర్సిటీ వీసీ సీ.యువరాజ్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టుచీరలు నాణ్యత, మెరుపు,తేలిక లాంటి అల్లికకు ప్రసిద్ధి చెందాయన్నారు. మిట్స్‌ ఛాన్సలర్‌ ద్వారకనాథ్‌ మాట్లాడుతూ రైతులు,నేత కార్మికులు తయారీదారులు జీఐ ట్యాగ్‌ సంభావ్య ప్రయోజనాలపై ఆశాభావంతో ఉన్నారన్నారు.

రాయచోటి టౌన్‌: ఈ నెల 21వ తేదీన నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ లక్ష్మీనరసయ్య, వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ ఉషశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి వైద్యశాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 0–5 సంవత్సరాల లోపు పిల్లలు 1,78,150 మంది ఉన్నారని తెలిపారు. వీరికి పోలియో చుక్కలు వేయడానికి 1615 బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. పోలియో చుక్కలు వేయడానికి 6648 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి 100 శాతం పోలియో లేని దేశం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

రాయచోటి: జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి పది సంవత్సరాల పైబడి క్‌లైమ్‌ చేయని బ్యాంకు అకౌంట్లలోని నగదును జిల్లా పరిపాలనకు వినియోగించుకునేలా.. జిల్లా కలెక్టర్‌ అకౌంట్‌లోకి బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులు, బ్యాంకుల ప్రతినిధులను జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఆదర్శరాజేంద్రన్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో వివిధ శాఖలకు సంబంధించి బ్యాంకు అకౌంట్లపై జిల్లా సంయుక్త కలెక్టర్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మొదట జిల్లాకు సంబంధించి వంద అకౌంట్‌లను గుర్తించి బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు,బ్యాంకర్లను ఆదేశించారు. నిల్వ ఉన్న నగదును జిల్లా పరిపాలనకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

సౌత్‌జోన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక  1
1/3

సౌత్‌జోన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక

సౌత్‌జోన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక  2
2/3

సౌత్‌జోన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక

సౌత్‌జోన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక  3
3/3

సౌత్‌జోన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement