వంద శాతం లక్ష్యం సాధించాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: రాయలసీమ జోన్ పరిధిలోని 8 జిల్లాలకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని రీజనల్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (ఆర్‌జేటీసీ) కృష్ణ వేణి పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని ఊటుకూరులో ఉన్న జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో రాయలసీమ జోనల్ స్థాయి అర్ధ వార్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ లక్ష్యాలను 82 శాతం మాత్రమే సాధించామని, వంద శాతం సాధించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వాహనాల పన్ను చెల్లించని యజమానులకు నోటీసులు పంపించాలని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి వాహన పన్నుల వసూలు పూర్తి చేయాలని సూచించారు. 2026 జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జిల్లాల్లో రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ పరిధిలోని 8 జిల్లాల డీటీసీలు, బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
వంద శాతం లక్ష్యం సాధించాలి


