
మంగంపేట ఆర్‌ఆర్ 5 లే అవుట్‌లు పరిశీలిస్తున్న కలెక్టర్ గీరీషా పీఎస్
కలెక్టర్ గిరీషా పీఎస్
ఓబులవారిపల్లె: మంగంపేట కాపుపల్లె, హరిజనవాడ, అరుంధతీవాడ, గ్రామాల ప్రజలకు అమోదయోగ్యంగా ఉండేలా పునరావాసం ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ గిరీషా పీఎస్ పేర్కొన్నారు. బుధవారం మంగంపేట ఆర్‌ఆర్ 5 నందు పునరావాసం కోసం ఏర్పాటు చేసిన లే అవుట్‌లను ఆయన పరిశీలించారు. పునరావాసం కోసం పనులను వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పనులలో జాప్యం జరుగకుండా అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో ఏపీఎండీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రామస్తుల కొరిక మేర కొన్ని మార్పులు చేర్పులను పరిశిలించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆర్‌ఆర్ ఫైవ్‌లో రోడ్లు,పార్కు, వాటర్‌ట్యాంక్ నిర్మణపనులు, ప్లాట్‌లను అధికారులు, గ్రామస్తులతో ఆనయ పరిశీలించి పలు సూచనలు చేశారు తహసీల్దార్ పుల్లరెడ్డి, సీపీఓ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీఓ విజయారావు,హౌసింగ్ డీఈ కుప్పుస్వామి, మంగంపేట గ్రామస్తులు గుత్తిరెడ్డి హరినాఽథ్ రెడ్డి, పులపత్తురి రామసుబ్బారెడ్డి, డీఆర్‌సీసీయూ మెంబర్ తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ మినుగుసుధాకర్, వైఎస్సార్ సీపీ నాయకులు గజ్జల శ్రీనివాసులరెడ్డి, ఎంపీటీసీ హరిబాబు,ఎంపీఎండీసీ అధికారులు, అన్నిశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం
జగనన్న ఆరోగ్య సురక్ష
రాయచోటి: జిల్లాలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి అడుగు మాత్రమే అని కలెక్టర్ గిరీషా పీఎస్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించబడిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి కార్యాలయ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో అనుసంధానం చేసి అనారోగ్యంతో బాధపడే వారికి పూర్తి ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమమని కలెక్టర్ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్య అన్నమయ్య జిల్లాగా మొదటి అడుగు వేయాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రాంతాలలో అన్ని సదుపాయాలను ఏర్పా టు చేసుకోవాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వర్తించేలా సిద్ధమవ్వా లని అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారి మనోహర్‌రాజు, డీఎంఅండ్ హెచ్‌ఓ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.