బుట్టబొమ్మ.. వచ్చిందమ్మా | - | Sakshi
Sakshi News home page

బుట్టబొమ్మ.. వచ్చిందమ్మా

Aug 26 2023 1:40 AM | Updated on Aug 26 2023 8:41 AM

- - Sakshi

యువనటి పూజా హెగ్డే కడపలో తళుక్కుమన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో పటేల్‌ రోడ్డు వద్ద సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌

కడప కార్పొరేషన్‌: యువనటి పూజా హెగ్డే కడపలో తళుక్కుమన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో పటేల్‌ రోడ్డు వద్ద సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభించేందుకు బుట్టబొమ్మ వచ్చింది. పూజను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తాను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు.యువకుల కేరింతలు, ఈలలతో ఆ ప్రాంతం సందడిగా మారింది.

కమలాపురం శాసనసభ్యులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఏపీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌ ఏ. మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్‌ ముంతాజ్‌బేగం, 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎం.రామలక్ష్మణ్‌రెడ్డిలు విశిష్ట అతిథు లుగా విచ్చేశారు. ఈ సందర్భంగా పూజహెగ్డే మాట్లా డుతూ కడప ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమనాలను మరిచిపోలేనన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం పండుగ రోజు సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభం కావడం సంతోషదాయకమన్నారు.

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ డైరెక్టర్‌ సురేష్‌ సీర్ణ మాట్లాడుతూ షాపింగ్‌ మాల్‌ కడపలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌లు పీవీఎస్‌ అభినయ్‌, రాకేష్‌, కేశవ్‌, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ పులి సునీల్‌ కుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడు పాకా సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement