
గాయపడిన శివ
మదనపల్లె : కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి వ్యక్తి గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి ములకలచెరువు మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం మట్లివారిపల్లెకు చెందిన శివ(38) కొంత కాలంగా మదనపల్లె పట్టణ శివారులోని చంద్రాకాలనీలో ఉంటూ ఇటుక బట్టీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంలో బెంగళూరుకు బయలుదేరాడు. మార్గంమధ్యలో కంటేవారిపల్లె కనికలతోపు వద్ద రోడ్డుకు అడ్డుగా కుక్క రావడంతో దాన్ని తప్పించబోయి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను గాయపడ్డాడు. గమనించిన స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
చెట్టుపై నుంచి పడి..
చెట్టుపై నుంచి పడి ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం పీటీఎం మండలంలో జరిగింది. మండలంలోని బూచిపల్లెకు చెందిన శ్రీనివాసులు(48) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం పొలం వద్ద చింత చెట్లు ఎక్కి కాయలు కోస్తుండగా, కొమ్మ విరగడంతో పట్టుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
బైక్ అదుపు తప్పి వ్యక్తికి గాయాలు