‘దేశంలో ఎక్కడా లేని కొరత ఏపీలోనే ఎందుకు?’ | YSRCP MP Avinash Reddy Meets Petroleum Secretary Neeraj Mittal | Sakshi
Sakshi News home page

‘దేశంలో ఎక్కడా లేని కొరత ఏపీలోనే ఎందుకు?’

Apr 28 2026 3:25 PM | Updated on Apr 28 2026 3:42 PM

YSRCP MP Avinash Reddy Meets Petroleum Secretary Neeraj Mittal

ఢిల్లీ: ఢిల్లీ: ఏపీలో పెట్రోల్‌,డీజిల్‌ సంక్షోభానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి కలిశారు. ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పెట్రో కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని నీరజ్‌ మిట్టల్‌ దృష్టికి తీసుకెళ్లారు అవినాష్‌రెడ్డి. ఏపీలోని పరిస్థితులను చక్కదిద్ది అవసరమైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు

అనంతరం అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ పెట్రోల్‌, డిజిల్‌ కొరత దేశంలో ఎక్కడా కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఏపీలో ఎందుకు కొరత ఏర్పడింది?, డిమాండ్‌కు, సప్లైకి మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయి. 70 శాతం పెట్రోల్ బంకులు కొరత వల్ల పనిచేయడం లేదు. పెట్రోలు 200 రూపాయలకు మించి బైక్‌లకు పోయడం లేదు. పొరుగు రాష్ట్రంలో ఇలాంటి కొరత ఎక్కడా లేదు. వ్యవసాయ రంగం ఆక్వాకల్చర్ ట్రాన్స్పోర్ట్ తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. 

ప్రజల రోజువారి పనుల పైన తీవ్రమైన అంతరాయం కలిగిస్తుంది. ప్రజల కష్టాలు తీర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం హోర్డర్స్ తో  కుమ్మక్కయింది. పలు ఆయిల్ కంపెనీలు కూడా సప్లైని తగ్గించాయి. కమర్షియల్ ఎల్పీజీ రేట్లు పెంచినా,  బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. ఏపీలోని పరిస్థితులను చక్కదిద్ది అవసరమైన పెట్రోల్ డీజిల్ ఎల్పీజీని అందుబాటులోకి తేవాలి. హోర్డింగు, బ్లాక్ మార్కెటింగ్, ఉద్దేశపూర్వక తగ్గింపు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement