
బిరదవోలు శ్రీకాంత్(ఫైల్‌ఫోటో)
నెల్లూరు : రుస్తుం మైన్స్ అక్రమ కేసులో అరెస్ట్ చేసిన వైఎస్సార్‌సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన అస్వస్థతకు లోనవడంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. జిల్లా సెంట్రల్ జైల్ నుండి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుండె పోటు వచ్చిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కాగా, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత నెల 21వ ేతేదీన అరెస్టైన వైఎస్సార్‌సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి.. అదే రోజు అర్థరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
రుస్తుం మైన్స్ అక్రమ కేసులో బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న శ్రీకాంత్‌రెడ్డిని గత నెలలో నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై శ్రీకాంత్‌రెడ్డి భార్య ఆగ్రహ వ్యక్తం చేశారు కూడా. ఏ సమాచారం ఇవ్వకుండా తన భర్తను తీసుకెళ్లారని ఆమె విమర్శించారు.