నేడు వైఎస్‌ జగన్‌ జువ్వలదిన్నె పర్యటన | Ys Jagan to Visit Nellore Juvvaladinne Fishing Harbor on April 15 | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్‌ జగన్‌ జువ్వలదిన్నె పర్యటన

Apr 15 2026 5:16 AM | Updated on Apr 15 2026 5:16 AM

Ys Jagan to Visit Nellore Juvvaladinne Fishing Harbor on April 15

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జువ్వలదిన్నెలో పర్యటించనున్నారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె చేరుకుంటారు.

10.30 గంటలకు ఫిషింగ్‌ హార్బర్‌ను పరిశీలించిన అనంతరం 11 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.

Advertisement
 
Advertisement
Advertisement