
సుబ్బరాయుడు కుటుంబానికి పరామర్శ
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. దీనిలో భాగంగా ఉదయం 9 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుండి నంద్యాల జిల్లా పర్యటనకు బయల్దేరి వెళతారు
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురం చేరుకొని.. సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. బెంగళూరుకు వెళతారు.