జ్యోతిరావ్ పూలేకు వైఎస్ జగన్ నివాళి | YS Jagan Pays Tributes To Jyotirao Phule On His Birth Anniversary | Sakshi
Sakshi News home page

జ్యోతిరావ్ పూలేకు వైఎస్ జగన్ నివాళి

Apr 11 2026 10:26 AM | Updated on Apr 11 2026 10:36 AM

YS Jagan Pays Tributes To Jyotirao Phule On His Birth Anniversary

ఫైల్‌ ఫొటో

సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సామాజిక సంస్కర్త జ్యోతిరావ్‌ పూలే జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. 

సమాజంలో సగభాగమైన స్త్రీలు అభివృద్ధి చెంద‌క‌పోతే దేశానికి పురోగతి అసాధ్యమని విశ్వసించిన జ్యోతిరావ్ పూలే.. నాడే మహిళా విద్యకు తొలి జ్యోతి వెలిగించారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు.. 

అనాథ శిశువుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించి, వితంతువుల పున‌ర్వివాహానికి మ‌ద్ద‌తుగా, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు వెన్నుదన్నుగా నిలిచారు అని గుర్తు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో వైఎస్ జగన్ ఓ ట్వీట్‌ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement