
వైఎస్సార్ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం(సెప్టెంబర్ 2వ తేదీ) కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు వైఎస్ జగన్. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.



వైఎస్సార్‌కు వైఎస్సార్‌సీపీ నాయకుల నివాళులు
ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటి సీఎంలు నారాయణ స్వామి, అంజాద్ బాషా , మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్, ఎమ్మెల్యే ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర నాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి ,రఘు రామ్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు తదితరులు వైఎస్సార్‌కు నివాళులర్పించారు.