పరస్పర ప్రేమ, క్షమాభావాన్ని ఆచరణలో పెట్టాలి | YS Jagan Mohan Reddy on the occasion of the holy day of Good Friday | Sakshi
Sakshi News home page

పరస్పర ప్రేమ, క్షమాభావాన్ని ఆచరణలో పెట్టాలి

Apr 4 2026 5:06 AM | Updated on Apr 4 2026 5:06 AM

YS Jagan Mohan Reddy on the occasion of the holy day of Good Friday

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: క్రీస్తు శిలువ వేయబడిన ఘటన ప్రేమ, కరుణ, త్యాగా­నికి అత్యున్నత ఉదాహరణగా నిలుస్తుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గుడ్‌ ఫ్రైడే పవిత్ర దినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కాసేపు ఆలోచించి, మనలో మనం చూసుకుని, మన విలువలను పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు. 

మనలను మనం ప్రేమించినట్టే ఇతరులనూ ప్రేమించాలి అనే యేసుక్రీస్తు బోధనే సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. పరస్పర ప్రేమ, సహనం, క్షమాభావం వంటి విలువలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజం శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని వైఎస్‌ జగన్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement