భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ | YS Jagan Holds Praja Darbar' At Bhakarapuram Camp Office | Sakshi
Sakshi News home page

భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌

Sep 1 2026 9:50 PM | Updated on Sep 1 2026 9:58 PM

YS Jagan Holds Praja Darbar' At Bhakarapuram Camp Office
  • వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన
  • రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్న మహిళలు, యువతులు
  • సోదరుడిలా అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వైఎస్‌ జగన్‌

పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.  

ఈ సందర్భంగావివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు మహిళలు, యువతులు వైఎస్‌ జగన్‌ను కలిసి రాఖీలు కట్టి తమ అభిమానం, ఆప్యాయతను చాటుకున్నారు. వారందరితో ఆత్మీయంగా మాట్లాడి వైఎస్‌ జగన్‌.. సోదరుడిలా ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ప్రజాదర్బార్‌కు వచ్చిన మరికొంత మంది తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, వాటికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వైఎస్‌ జగన్‌ను కలిశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement