9న ఒంటిమిట్ట కోదండరామయ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 

Vontimitta Temple Brahmotsavam Ankurarpanam On 9th April Annamayya District - Sakshi

ఒంటిమిట్ట(సిద్దవటం): ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్‌ 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఈనెల 9వ తేదీన సాయంత్రం అంకురార్పణ జరగనుంది.10 తేదీన ఉదయం 8నుంచి 9 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం శేషవాహనం, 11న వేణుగాన అలంకారం, హంసవాహనం, 12న వటపత్రశాయి అలంకారం, సింహవాహనం, 13న నవనీత కృష్ణ అలంకారం, హనుమత్సేవ, 14న మోహినీ అలంకారం, గరుడసేవ, 15న శివధనుర్భాలంకారం, రాత్రి 8 గంటలకు శ్రీ సీతా రాముల కల్యాణం, గజవాహనం, 16న రథోత్సవం, 17న కాళీయమర్ధన అలంకారం, ఆశ్వవాహనం, 18న చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావ రోహణం, 19న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరగనున్నాయి.  

కల్యాణోత్సవానికి పటిష్ట బందోబస్తు : ఎస్పీ
కడప అర్బన్‌: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్సోత్సవాల్లో భాంగా ఈనెల 15న నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి విచ్చేయనుండటంతో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేపట్టాలన్నారు.

కల్యాణానికి అధికసంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయపరిసరాలు, కల్యాణ వేదిక వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. సమావేశంలో ఏఆర్‌ డిఎస్పీ రమణయ్య, కడప డిఎస్పీ బి. వెంకట శివారెడ్డి, ట్రాఫిక్‌ డిఎస్పీ బాలస్వామిరెడ్డి, ఎస్‌బి సీఐలు వెంకటకుమార్, రెడ్డెప్ప, ఆర్‌ఐ మహబూబ్‌బాషా, కడప ఒన్‌టౌన్‌ సీఐ టివి సత్యనారాయణ, అర్బన్‌ సీఐ ఎస్‌ఎం ఆలీ తదితరులు పాల్గొన్నారు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top