విశాఖ కైలాసగిరి వద్ద టూరిస్ట్ బస్సుకి ప్రమాదం | Visakhapatnam Kailasagiri Bus Accident Details Telugu News | Sakshi
Sakshi News home page

విశాఖ కైలాసగిరి వద్ద టూరిస్ట్ బస్సుకి ప్రమాదం

Sep 9 2024 6:18 PM | Updated on Sep 9 2024 7:20 PM

Visakhapatnam Kailasagiri Bus Accident Details Telugu News

విశాఖపట్నం, సాక్షి:  కైలాసగిరి వద్ద సోమవారం సాయంత్రం ఘోరం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

బ్రేక్ ఫెయిల్ కావడంతో మలుపు వద్ద కొండను బస్సు ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, వీళ్లంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన టూరిస్టులు అని తెలుస్తోంది. వీళ్లలో 18 మందికి 18 మందికి స్వల్ప గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. 16 మందికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేయగా.. మరో ఇద్దరికి మాత్రం కేజీహెచ్ వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement