జగనన్న విద్యాదీవెన: తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్‌

Vidya Deevena Funds Release Tiruvuru CM Jagan Live Updates - Sakshi

Updates:
జగనన్న విద్యా దీవెన కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు.

గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది.

సీఎం జగన్‌ ప్రసంగం:
సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్‌లు నచ్చరు..
ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే
చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు

ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి
పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు
అర్హతలేని వారు మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు
విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం

కుటుంబం, రాజకీయ, మనవతా విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం
మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్
గత ప్రభుత్వంలో డీపీటీ.. దోచుకో, పంచుకో, తినుకో..
కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం
17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి
45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9లక్షల కోట్లు అందించాం

ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నాం
ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నాం
ఏప్రిల్ 11న రెండో విడత వసతి దీవెన నిధులు
ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది

జీఈఆర్ రేషియో 32 నుంచి 72 శాతానికి తీసుకెళ్లే దిశగా అడుగులు
ప్రభుత్వ బడులు, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నాం
మీ పిల్లల చదువులకు నాది బాధ్యత
ఉన్నత విద్యకు మరింత ఊతమిచ్చే చర్యలు తీసుకున్నాం
8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం
రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం
ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి తెస్తాం

పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టాం: సీఎం జగన్‌
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే
ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువుతోనే సాధ్యం
ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది.
ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువే
కలెక్టర్‌ ఢిల్లీరావు సాధారణ కుటుంబం నంచి వచ్చిన వ్యక్తి
చదువుకు పేదరికం అడ్డుకాకూడదు
దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు
కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే

గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు
ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు
లంచాలు, వివక్ష లేకుండా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నిధులు జమ చేస్తున్నాం
గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అరకొరగా ఇచ్చేవాళ్లు
ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడేవారు
తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి
అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం
జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చాం
27 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చాం
చంద్రబాబు హయాంలోని బకాయిలను సైతం చెల్లించాం
విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నాం
తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుంది
కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే మాట్లాడతాం

సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు.. కాసేపట్లో నాలుగో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు.

సీఎం జగన్‌కు ఘన స్వాగతం
కొద్దిసేపట్లో మార్కెట్ యార్డ్‌లోని సభా ప్రాంగణానికి సీఎం జగన్‌ చేరుకోనున్నారు.

తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, మంత్రి బొత్స సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్,ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మేకా ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు సీఎంకు స్వాగతం పలికారు.

జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా తిరువూరు వాహినీ కాలేజ్ గ్రౌండ్స్‌లోని హెలీప్యాడ్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు.

జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే.

గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తోంది.

జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ప్రశ్నించే హక్కును, తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది.   

ఉన్నత విద్యకు ప్రోత్సాహం
► జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. 

► కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ పెట్ట­డం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అను­గుణంగా తీర్చిదిద్దుతోంది. 40 అంశాలలో నైపుణ్యం పెంపొందించేలా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి చేసి, సర్టిఫికెట్స్‌ పంపిణీ చేసింది. దేశంలో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్‌ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

► ఇంటర్‌ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంస్కరణల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి 22,387కు చేరింది.  

► 2018–19లో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 2020–21 సంవత్సరానికి 37.2కు పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్‌ శాతం 70కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంది. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది. 

► 2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ గణనీయంగా పెరిగి 2021–22కి 85,000 కు చేరడం విశే­షం. విద్యా రంగంపై జగన్‌ ప్రభుత్వం గత 45 నెలల్లో మొత్తం రూ.57,642.36 కోట్లు వెచ్చించింది. 

► 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, నాడు –నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్‌ రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top