నియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త : వైఎస్‌ జగన్‌ | Updates on YS Jagan Key Meeting with Addanki YSRCP Leaders At Tadepalli | Sakshi
Sakshi News home page

నియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త : వైఎస్‌ జగన్‌

Mar 25 2026 12:30 PM | Updated on Mar 25 2026 1:51 PM

Updates on YS Jagan Key Meeting with Addanki YSRCP Leaders At Tadepalli

సాక్షి,తాడేపల్లి : నియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. యుద్ధం పేరు చెప్పి నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ నేతలతో వైఎస్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, అద్దంకి నియోజకవర్గ ఇంఛార్జి డా.అశోక్ కుమార్‌తో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.  

‘యుద్ధం పేరు చెప్పి వంటనూనె ధరలు లీటర్‌కు రూ.4౦ వరకు పెంచేశారు. పప్పుల ధర కిలోకి రూ.15లకు పైగా పెంచేశారు. బ్లాక్‌లో సిలిండర్లను రూ.2 వేలకు, రూ.3వేలకు అమ్ముతున్నారు. ఇప్పుడు కిరోసిన్‌ ఇస్తామంటున్నాడు. ఇప్పుడు కొత్తగా కిరోసిన్‌ స్టౌవ్‌లు కొనుక్కోవాలా?. మొక్కజొన్న, కోకో, శెనగ, అరటి, టమోటా పంటలకు ధర లేదు.

చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి. క్రెడిట్‌ దోపిడీ చేస్తున్నాడు.ఆర్సెలర్‌ మిట్టల్‌ స్టీల్ ప్లాంట్‌ వ్యవహారంలోనూ చంద్రబాబుది క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు. 2022లో దావోస్‌ పర్యటనలో ఆదిత్య మిట్టల్‌ నాతో సమావేశమయ్యారు. రూ.4,800 కోట్లు గ్రీన్‌కోలో పెట్టుబడులు పెట్టారు. ఎస్‌ఆర్‌ స్టీల్‌ను కొనుగోలు చేసి మన హయాంలో వేయికోట్లు పెట్టుబడులు మన హయాంలో పెట్టారు. కొత్త స్టీల్‌ ప్లాంట్‌ పెడతామంటే మనమే ఆహ్వానించాం. మా హయాంలోనే కాకినాడ, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపించాం. ఎన్నికలకు ముందు వచ్చి నక్కపల్లిని ఎంపిక చేసుకున్నారు. తనని చూసి స్టీల్‌ప్లాంట్‌ వచ్చినట్లు బాబు బిల్డప్‌ ఇస్తున్నారు. గూగుల్‌ విషయంలోనూ ఇలాగే క్రెడిట్‌ దోపిడి చేస్తున్నారు.

2023లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ తీసుకు వచ్చాం. ఎక్కవ ల్యాండ్‌ కావాలని సంక్షోభం సృష్టించారు. దీనివల్ల బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ తిరోగమనంలో ఉంది. మన హయాంలో 3 పోర్టులు ప్రభుత్వ రంగ పోర్టులు తీసుకు వచ్చాం. రెండేళ్లు గడిచినా పోర్టుల్లో పనులు ముందుకు సాగడం లేదు. పోర్టులకు చుట్టుపక్కల మళ్లీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

కష్టపడే కార్యకర్తలకు పెద్దపీట
నియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త. మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. మన పాలనలో మహిళలకు పెద్దపీట వేశాం. పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో మనం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చాం.ఇప్పుడు మహిళలకు చట్టసభల్లో మరిన్ని సీట్లు రాబోతున్నాయి. సీట్లు పెరగడం వల్ల మన కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతారు. పార్టీలో పటిమ చూపించే వారికి, కష్టపడే వారికి పెద్దపీట వేస్తాం. జగన్‌ 2.Oలో కార్యకర్తలకు పెద్దపీట’ ఉంటుందని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement