బాబు.. ఓ ‘పిల్స్‌’ ఫ్యాక్టరీ..  | Sakshi
Sakshi News home page

బాబు.. ఓ ‘పిల్స్‌’ ఫ్యాక్టరీ.. 

Published Sat, Feb 3 2024 5:04 AM

Unveiling posters of report highlights by Andhra Advocates Forum - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు వందలాది తప్పుడు కేసులు పెట్టించి రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి అడుగడుగునా అడ్డుతగులుతున్నారని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ‘పిల్స్‌’ (ప్రజాప్రయోజన వ్యాజ్యాలు) ఫ్యాక్టరీని నడుపుతూ దేశంలో ఏ ప్రభుత్వంపైనా లేనన్ని కేసులు ఈ అభివృద్ధి నిరోధక శక్తులు వేశాయని, వారు తమ స్వార్థం కోసం ప్రజాహిత వ్యాజ్యాన్ని కూడా దు ర్వినియోగపరుస్తున్నారని వారు దుయ్యబట్టారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రాష్ట్రానికి కరోనా వైరస్‌ కన్నా ప్రమాదకరంగా మారారని ఆరోపించారు.

‘జగన్‌ పాలన–న్యాయవాదుల స్పందన’ అంశంపై ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజు ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న న్యాయవాదులు తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిపై ఆంధ్రా అడ్వకేట్స్‌ ఫోరం రూపొందించిన నివేదిక ముఖ్యాంశాల పోస్టర్లను అవిష్కరించిన అనంతరం వారు తమ మాట్లాడారు. ఎవరెవరు ఏమన్నారంటే.. 

చంద్రబాబు ఫ్యాక్టరీ నుంచే ‘పిల్స్‌’.. 
న్యాయ వ్యవస్థలోని కొందరు కక్షపూరితంగా వ్యవరించారు. జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ పదవీ విరమణచేసే రోజు జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, తర్వాత అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో ఉన్న ఆయనపై ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

అలాగే, జగన్‌పై ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన జస్టిస్‌ బట్టు దేవానంద్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మందలించారు. చంద్రబాబు ఒక ‘పిల్‌ ఫ్యాక్టరీ’ని తయారుచేసి జగన్‌ ప్రభుత్వంపై సొంత ఖర్చులతో పిల్స్‌ వేయిస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం అవన్నీ తట్టుకుంటూ ముందుకెళ్లడం అభినందనీయం.  – వీవీఆర్‌ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ 

వారికి స్థలాలిచ్చి బీసీలకు ఇవ్వకుండా కోర్టు స్టేనా!? 
అమరావతిలో బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టు స్టే ఇచ్చింది. కానీ, అదే అమరావతిలో న్యాయమూర్తులకు, బ్యూరోక్రాట్లకు స్థలాలు కేటాయించారు. ఇదేం న్యాయం? పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి సీఎం జగన్‌ మంచి పనిచేశారు. విదేశీ విద్య పథకంతో సామాన్యులను చదివిస్తున్నారు. 75 ఏళ్లలో ఎవరూ ఇలాంటి పనిచేయలేదు. దేశంలోనే బెస్ట్‌ సీఎం జగన్‌.  – బి.అశోక్‌కుమార్, అధ్యక్షుడు, ఆంధ్ర అడ్వకేట్స్‌ ఫోరం 

కేసులు లేకపోతే మరింత అభివృద్ధి.. 
ఇన్‌ఫ్రా రంగంలో రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రతి పక్షాలు, ఒక వర్గం మీడియా పురోగతి ఏమీలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. క్రెడిట్‌ రేటింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సర్విసెస్‌ ఇండియా లిమిటెడ్‌ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో సుమారు రూ.70 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుండగా.. అందులో  రూ.6.75 లక్షల కోట్ల విలువైన పనులు ఒక్క ఏపీలోనే జరుగుతున్నాయి.

అలాగే, జగన్‌ ప్రభుత్వంలో ఆరు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, పది హార్బర్లు, నాలుగు పోర్టులు, మూడు ఇండ్రస్టియల్‌ కారిడార్లు, రెండు మేజర్‌ ఎయిర్‌పోర్టులు, 31 చిన్న, మధ్య తరహా పారిశ్రామిక పార్కుల నిర్మాణం జరుగుతోంది. ఇంత పెద్దఎత్తున ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ మరే రాష్ట్రంలోనూ జరగడంలేదు. – వెంకట్‌ మేడపాటి, అధ్యక్షుడు,  ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ 

దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ.. 

ఇటీవల ప్రధాని మోదీ∙కూడా స్వార్థపూరిత ప్రజాహిత వ్యాజ్యాలపట్ల ఆందోళన వ్యక్తంచేశారు. 2023–24లో పారిశ్రామిక రంగంలో 16.36 శాతం, స ర్విస్‌ సెక్టార్‌లో 20 శాతం, వ్యవసాయ రంగంలో 13 శాతం వృద్ధిని మన రాష్ట్రం సాధించింది. కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా సుమారు రూ.20 లక్షల కోట్లు పేదలకు నేరుగా బదిలీ చేయగా, ఒక్క వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లు బదిలీచేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. – నారాయణమూర్తి, ఉపాధ్యక్షుడు, నవరత్నాలు అమలు కమిటీ 

స్వార్థశక్తుల చేతుల్లో ‘పిల్‌’ 
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తరచుగా కోర్టులు జోక్యం చేసుకోవడంవల్ల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. సామాన్యుల కోసం పిల్‌ సదుపాయం కలి్పస్తే అది స్వార్థశక్తుల చేతిలో ఆయుధంగా మారింది. అనవసరమైన కోర్టు కేసులు లేకపోతే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఉండేది. – నరహరశెట్టి శ్రీహరి, సీనియర్‌ న్యాయవాది  

విద్యలో కేరళను దాటేస్తున్నాం.. 
రాష్ట్రంలో పిలిచి ఉద్యోగాలిస్తున్నారు.. పోర్టులు కడుతున్నారు.. విద్యా వ్యవస్థలో కేరళను దాటి ఏపీ మొదటి స్థానానికి వెళ్తోంది. తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పరోక్షంగా న్యాయవాదుల కుటుంబాలు బాగుపడుతున్నాయి. జూనియర్‌ లాయర్లకు రూ.5వేలు గతంలో ఎవరూ ఇవ్వలేదు. – ధనలక్ష్మి, న్యాయవాది 

ఈ సర్కారును మళ్లీ గెలిపించుకోవాలి.. 
విద్యావ్యవస్థలో సీఎం జగన్‌ ప్రక్షాళన తీసుకొచ్చారు. బడుగులు తెలుగు మీడియంలోనే చదవాలన్నట్లు గత ప్రభుత్వాలు చేశాయి. పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని సీఎం జగన్‌ అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలి.  – బి. సౌమ్య, న్యాయవాది 

ప్రతీ హామీని జగన్‌ నెరవేర్చారు.. 
మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీనీ సీఎం జగన్‌ నెరవేర్చారు. లాయర్లు, ఆటోడ్రైవర్ల దగ్గర్నుంచి పారిశ్రామికవేత్తల వరకూ, అన్ని వర్గాల వారికీ ఆరి్థక చేయూతనిస్తున్నారు. అలాంటి సీఎంను మళ్లీ మనందరం మద్దతిచ్చి గెలిపించుకోవాలి.  – ఉషాజ్యోతి, న్యాయవాది 

సంక్షేమ పాలనను లాయర్లు అందరికీ చెప్పాలి.. 
రాష్ట్రంలో సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ పాలన గురించి న్యాయవాదులు తమ వద్దకు వచి్చన ప్రతి ఒక్కరికీ చెప్పి, వాళ్లకు జరిగిన మేలు గురించి గుర్తుచేయాలి. వారి ద్వారా ప్రజలందరికీ తెలిసేలా చేయాలి.  – జంగా జయలక్ష్మి, సీనియర్‌ న్యాయవాది 

లాయర్లకు జగన్‌ తప్ప ఎవరూ మంచి చేయలేదు.. 
గతంలో న్యాయవాదులను వాడుకోవడం తప్ప ఏ ప్రభుత్వం మంచి చేయలేదు. జగన్‌ సీఎం అయ్యాక రూ.100 కోట్లు ఇస్తామన్నారు. అన్నట్లుగానే ఇచ్చారు. నవరత్నాలు అనే పదాన్ని ఎక్కడ చదివారోగానీ ఆ పేరుతో అందరికీ మంచి చేస్తున్నారు. అవి నిలబడాలంటే జగన్‌ మళ్లీ గెలవాలి.  – రమణి, సీనియర్‌ న్యాయవాది 

మళ్లీ టీడీపీ బానిసత్వంలోకి వెళ్లొద్దు.. 
పధా్నలుగు సంవత్సరాల వనవాసం నుంచి బయటకు వచ్చినట్లుంది జగన్‌ పాలన. మళ్లీ టీడీపీ బానిసత్వంలోకి వెళ్లకుండా ఉండాలంటే న్యా­యవాదులంతా కలిసికట్టుగా ఉండాలి. రాష్ట్రంలో చెడ్డ వారంతా చంద్రబాబుకి మద్దతిస్తున్నారు. మంచివాళ్లు జగన్‌ని కోరుకుంటున్నారు.  – జీవనజ్యోతి, న్యాయవాది 

రాష్ట్రంలో అద్భుత ప్రగతి.. 
జగన్‌ ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే వెంటనే కేసులు వేసి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారు. ప్రజాహిత వ్యాజ్యం అనేది సామాన్యుల న్యాయం కోసం రూపొందిస్తే వాటిని పెత్తందారులు హస్తగతం చేసుకున్నారు. 24 నెలల కరోనా కాలం తర్వాత మిగిలిన మూడేళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. 2023–24లో 17 శాతం స్ధూల జాతీయోత్పత్తి వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్ధానంలో ఉంది. – చిన్నం రామకృష్ణ, న్యాయవాది

Advertisement
 

తప్పక చదవండి

Advertisement