కేఆర్‌ఎంబీ ఆదేశాలు పట్టించుకోని తెలంగాణ

Union Minister answers for Vijayasai Reddy question - Sakshi

విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులి చింతల ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు ఉత్పాదన నిలిపివేయాలంటూ పలుసార్లు ఆదేశాలిచ్చినా తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని కేంద్రం తెలిపిం ది. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లకుండా తెలంగాణ ఏకపక్షంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తోందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జూలై 5న లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌హౌస్‌లో విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయాలంటూ జూన్‌ 17న తెలంగాణ జెన్‌కోను ఆదేశించినట్లు తెలి పారు. అయినప్పటికీ శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌హౌస్‌తో పాటు నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుత్తు ఉత్పాదనను కొనసాగించడంతో వెంటనే నిలిపివేయాలని జూలై 15న తెలంగాణ జెన్‌కో అధికారులను కేఆర్‌ఎంబీ ఆదేశించిందన్నారు.

విద్యుత్తు ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు, తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జలవిద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసినట్లు చెప్పారు. కేఆర్‌ఎంబీ లేఖలకు తెలంగాణ జెన్‌కో (హైడల్‌) డైరెక్టర్‌ జూలై 16న ప్రత్యుత్తరమి స్తూ తమ ప్రభుత్వ ఆదేశాల మేరకే జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారన్నారు. విద్యుత్తు ఉత్పాదన కోసం నీటిని వినియోగించేందుకు ఆదేశాలు జారీచేసే వరకు.. శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌హౌస్, నాగా ర్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో విద్యుత్‌ ఉ త్పాదన కోసం నీటి విడుదలను నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని కేఆర్‌ఎంబీ జూలై 16న రా సిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలి పారు. అయినప్పటికీ కేఆర్‌ఎంబీ ఆదేశాలను బేఖా తరు చేస్తూ తెలంగాణ జలవిద్యుత్తు ఉత్పత్తిని కొనసాగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో కేఆర్‌ఎంబీకి కల్పించిన అధికారాలను సద్వినియో గం చేసేదిశగా ఆ బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీచేసినట్లు చెప్పారు. దీనివల్ల బోర్డు సమర్థంగా పనిచేస్తుందన్నారు.

విశాఖ ఉక్కుకు రబోధి బొగ్గు గనులు
విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్‌)కు జార్ఖండ్‌లోని రబోధి బొగ్గు గనులు కేటాయిస్తూ 2019లోనే ఆదేశాలు జారీచేసినట్లు కేంద్రం తెలిపింది. కోకింగ్‌ కోల్‌ లభించే రబోధి బొగ్గుగనిని ఆర్‌ఐఎన్‌ఎల్‌కు కేటాయిస్తున్నట్లుగా నామినేటెడ్‌ అథారిటీకి 2019 డిసెంబర్‌ 16న ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వాలని కూడా ఆ ఆదేశాల్లో స్పష్టంగా ఉందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు బొగ్గు గనులను కేటాయించాలని కోరుతూ బొగ్గు మంత్రిత్వశాఖకు పలు దఫాలుగా విజ్ఞప్తులు వచ్చిన విషయం వాస్తవమేనని చెప్పారు. ఆ విజ్ఞప్తుల మేరకే ఆర్‌ఐఎన్‌ఎల్‌కు రబోధి గనుల కేటాయింపు జరిగిందన్నారు. అయితే ప్రభుత్వరంగ సంస్థల్లో కొన్నింటిని వ్యూహాత్మక విక్రయం చేయాలన్న ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఆర్‌ఐఎన్‌ఎల్‌లోని నూరుశాతం ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. 

మార్చి నాటికి సాలూరు బైపాస్‌ రోడ్డు పూర్తి
రాయపూర్‌–విశాఖపట్నం సెక్షన్‌ జాతీయ రహదారి 26లో భాగంగా సాలూరు టౌన్‌ వద్ద బైపాస్‌ రోడ్డు నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కోవిడ్‌ లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా బైపాస్‌ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు.  ప్రస్తుతం 32 శాతం బైపాస్‌ పనులు జరిగాయని, గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి కల్పన చేస్తున్నట్లు కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి నారాయణ్‌ రాణే తెలిపారు. ఈ పథకం ద్వారా 2018–19 నుంచి 2021–22లో జూలై 9 వరకు 6,536 మెక్రో ఎంటర్‌ప్రైజెస్‌ల ఏర్పాటు ద్వారా 52,288 మందికి ఉపాధి కల్పన అంచనా వేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ ప్రశ్నకు జవాబుగా తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top