AP: వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీల జాబితా పూర్తి

Transfers List Complete In AP Medical And Health Department - Sakshi

తప్పనిసరి బదిలీ లిస్టులో 1,300 మంది

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో అన్ని క్యాడర్‌ల ఉద్యోగుల సాధారణ బదిలీల కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. విభాగాల వారీగా అందరు ఉద్యోగుల సర్వీసు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా బదిలీ ప్రక్రియ చేపడుతున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో 13 జిల్లాల్లోని మెడికల్‌ కళాశాలల్లో ట్యూటర్‌ల నుంచి ప్రొఫెసర్‌ స్థాయి వరకూ బదిలీలకు అర్హులైన వారి గుర్తింపు పూర్తయింది.

చదవండి: జగనన్న విద్యా కానుక టెండర్‌ నిబంధనలు సరైనవే.. 

431 మంది ప్రొఫెసర్‌లు ఉండగా వీరిలో 250 మందికిపైగా ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నారు. అదే విధంగా 375 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లలో 190 మందికిపైగా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 1,737 మందికి గాను 800 మంది, ట్యూటర్లు 123 మందికి గాను సుమారు 70 మంది.. ఇలా మొత్తంగా 1,300 మందికిపైగా తప్పనిసరి బదిలీల జాబితాలో ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. వీరందరి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.  ఉద్యోగులు 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బదిలీ జీవోల్లో మార్పులు చేయాలి
ఒకే చోట 5 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వైద్యులందరినీ బదిలీ చేయడానికి ప్రభుత్వం విడుదల చేసిన జీవోల్లో మార్పులు చేయాలని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పిడకాల శ్యామ్‌సుందర్‌ శుక్రవారం డిమాండ్‌ చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top