టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Today Morning News Headlines (28-1-2021) - Sakshi

భూమా కుటుంబ ఏకఛత్రాధిపత్యానికి చెక్
కర్నూలు జిల్లా విజయ డెయిరీ చైర్మన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసింది. దివంగత మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి సమీప బంధువు భూమా నారాయణరెడ్డి 25 సంవత్సరాలుగా చైర్మన్‌గా కొనసాగుతున్నారు. భూమా కుటుంబ పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు. బుధవారం నంద్యాలలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులయిన ముగ్గురు డైరెక్టర్లు భారీ మెజార్టీతో విజయం సాధించారు. పూర్తి వివరాలు.. 

ఫిట్‌మెంట్‌ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు
 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి మూలవేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫారసు చేసింది. 2018 జూలై 1 నుంచి వేతన సవరణ అమలు చేయాలని సూచించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పొడిగించాలంటూ మరో కీలక సిఫారసు కూడా చేసింది. పూర్తి వివరాలు.. 

రైతు ఉద్యమంలో చీలికలు
వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సుమారు గత 2 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమంలో చీలికలు ప్రారంభమయ్యాయి. రైతు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఘటనలకు నిరసనగా రైతు ఆందోళనల నుంచి విరమించుకుంటున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌(భాను), రాష్ట్రీయ కిసాన్‌ ఆందోళన్‌ సంఘటన్‌ బుధవారం ప్రకటించాయి. పూర్తి వివరాలు.. 

ట్రంప్‌ అభిశంసన రాజ్యాంగ విరుద్ధం
అమెరికా మాజీ అధ్యక్షుడు  ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడంపై డెమొక్రాట్లపై పలువురు రిపబ్లికన్‌ సెనేటర్లు విరుచుకుపడ్డారు. ఈ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమంటూ 45 మంది సెనేటర్లు తేల్చిచెప్పారు. ట్రంప్‌ అనునూయులు హింసకు, హేట్‌ స్పీచ్‌కు పాల్పడ్డారని, ఇందుకు ట్రంపే కారణమని డెమొక్రాట్లు చెప్పడాన్ని దుయ్యబట్టారు. పూర్తి వివరాలు.. 

డబుల్‌ మర్డర్‌: భూతవైద్యుడి ఎంట్రీ.. కేసు కీలక మలుపు
మదనపల్లె జంట హత్యల కేసు కొత్తమలుపులు తిరుగుతోంది. దీనిపై బుధవారం రాత్రి స్థానిక బుగ్గకాలువకు చెందిన భూత వైద్యుడు సుబ్బరామయ్య మీడియాతో మాట్లాడారు. తాను దుర్గమ్మ భక్తుడినని 50 ఏళ్లుగా పలువురికి వైద్యం చేస్తున్నానన్నారు. శనివారం ఉదయం సాయిచిత్ర భాస్కర్, రాజు అనే అన్నదమ్ములు తమ బంధువుల పిల్లలకు చాలా సీరియస్‌గా ఉందని, పురుషోత్తం నాయుడు, పద్మజ ఇంటికి తీసుకు వెళ్లారని తెలిపారు.  పూర్తి వివరాలు.. 

ఫ్యాక్షనిస్టులా నిమ్మగడ్డ శైలి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ సూత్రధారిగా మారారని చెప్పారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన ఆయన అధికారులపై దుందుడుకుగా దాడికి సిద్ధమయ్యారని, ఇది ఫ్యాక్షనిస్టు ధోరణిని తలపిస్తోందని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు.. 

రేపే ‘సన్నాఫ్‌ ఇండియా’ ఫస్ట్‌లుక్‌..
సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కోవడానికి సన్నాఫ్‌ ఇండియా రెడీ అయ్యారు. సన్నాఫ్‌ ఇండియా ఎలా ఉంటారో చిన్న లుక్‌ ద్వారా పరిచయం చేస్తారట. మోహన్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న సోషల్‌ డ్రామా ‘సన్నాఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకుడు. పూర్తి వివరాలు.. 

ఓటమితో మొదలు...
ప్రతిష్టాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు శుభారంభం లభించలేదు. బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో మహిళల, పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో ఇద్దరికీ ఓటమి ఎదురైంది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘బి’లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్, ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ సింధు 21–19, 12–21, 17–21తో పరాజయం పాలైంది. పూర్తి వివరాలు.. 

టిక్‌టాక్‌ శాశ్వతంగా బంద్‌
వీడియో షేరింగ్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సర్వీస్‌ అయిన టిక్‌టాక్‌ను భారత్‌ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను ప్రమోట్‌ చేస్తున్న చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్‌.. భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2,000 పైచిలుకు ఉద్యోగులను తీసివేయనుంది. పూర్తి వివరాలు.. 

వారిది షేర్‌డ్‌ సైకోటిక్‌ డిజార్డర్‌ కావచ్చు!
మదనపల్లెలో ఇద్దరు విద్యాధికులైన తల్లిదండ్రులు ఒక ఉన్మాదం లాంటి స్థితిలో తమ ఇద్దరు కూతుళ్లనూ హత్య చేశారు. కలియుగం అంతమైపోయి ఆ మర్నాటి నుంచి సత్యయుగం ప్రారంభమవుతుందని నమ్మారు. తమ కూతుళ్లను ఆ యుగంలోకి పంపేందుకు పూజలు నిర్వహిస్తూ బిడ్డలను హతమార్చారు. పైగా తమ బిడ్డలు మరణించలేదనీ... కొద్దిసేపట్లో జీవించి తిరిగి లేస్తారని చెబుతున్నారు. పూర్తి వివరాలు.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top