కోటంరెడ్డికి ఊహించని షాక్‌.. అరెస్ట్‌ తప్పదా?

TDP Leader Matangi Krishna Serious Allegations On Kotamreddy Sridhar - Sakshi

సాక్షి, నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మరో షాక్‌ తగిలింది. కోటంరెడ్డిపై టీడీపీ దళిత నేత మాతంగి కృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీధర్‌రెడ్డిని పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ సంచలన కామెంట్స్‌ చేశారు.

కాగా, మాతంగి కృష్ణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నన్ను హత్య చేయించడానికే కోటంరెడ్డి ప్రయత్నించాడు. 25 మంది అనుచరులను నాపైకి దాడికి పంపాడు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాను. అసలు సూత్రధారి కోటంరెడ్డిని కూడా అరెస్ట్‌ చేయాలి. కోటంరెడ్డిని పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అయితే.. నెల్లూరులో నాలుగు నెలల క్రితం మాతంగి కృష్ణపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పట్లో సాక్ష్యాలు లభ్యం కాలేదు. తాజాగా పలువురు ప్రత్యక్ష సాక్షులు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పడంతో గత రాత్రి తాటి వెంకటేశ్వర రావు, మన్నేపల్లి రఘు, జావెద్ అనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top