నైట్‌కి ఎంత తీసుకుంటావు! | TDP Leader Harasses Bigg Boss Contestant on Instagram | Sakshi
Sakshi News home page

నైట్‌కి ఎంత తీసుకుంటావు!

Mar 31 2026 5:07 AM | Updated on Mar 31 2026 11:25 AM

TDP Leader Harasses Bigg Boss Contestant on Instagram

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో ఐటీడీపీ నందికొట్కూరు ఇన్‌చార్జ్‌ బిజ్జవరపు ప్రవీణ్‌కుమార్‌ (ఫైల్‌)

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కు ఇన్‌స్టాలో టీడీపీ నాయకుడి వేధింపులు 

సోషల్‌ మీడియాలో వైరల్‌ 

మండిపడుతున్న మహిళలు, ప్రజలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: టీడీపీ నేతలు రోజురోజుకూ మరింత బరితెగిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దానిని మరువకముందే  తాజాగా బిగ్‌బాస్‌–8 మహిళా కంటెస్టెంట్‌ను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఐటీడీపీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బిజ్జవరపు ప్రవీణ్‌కుమార్‌ ఓ అసభ్యకర పోస్టు పెట్టారు. గత ఆదివారం రాత్రి 11.21 గంటల సమయంలో ‘నైట్‌కి ఎంత తీసుకుంటావు? సుఖంతోపాటు డబ్బులు కూడా ఇస్తా’ అంటూ బిజ్జవరపు ప్రవీణ్‌కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఎమ్మెల్యే బావమరిదినని చెప్పుకొంటున్న ఐటీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌ తీరుపట్ల ప్రజలు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే కింది స్థాయి నాయకులు కూడా మరింత బరితెగించి రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు.

ఒక రాత్రికి నీ రేటెంత..? iTDP ఇంచార్జి వేధింపులు

Advertisement
 
Advertisement
Advertisement