కుప్పంలో పచ్చ నేతల కరెంట్‌ డ్రామా.. బంద్‌ చేయించి మరీ కొవ్వొత్తి ర్యాలీలు

TDP Kuppam Leaders Power Cut Drama - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి కుప్పం(చిత్తూరు) టీడీపీ నేతలు ఎన్నిరకాల అడ్డదారులు తొక్కాలో.. అన్ని దారుల్లోనూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కరెంట్‌ కోతల డ్రామాను తెర మీదకు తీసుకొచ్చారు. 

ఒక పథకం ప్రకారం రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో  విద్యుత్‌ సరఫరాను బంద్‌ చేయిస్తున్న పచ్చ నేతలు.. ఆ వెంటనే కరెంట్‌ లేదంటూ కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే అసలు విషయం వెలుగు చూడడంతో ఇప్పుడు నీళ్లు నములుతున్నారు. ఇక ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే నడుస్తున్న డ్రామా అంటున్నారు స్థానిక నేతలు.

విషయం వెలుగులోకి రావడంతో ఈ కుట్ర వెనుక ఉన్న టీడీపీ నేతపై కేసు నమోదు అయ్యింది. అంతేకాదు.. విద్యుత్‌ సరఫరాను నిలిపివేసిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top