శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల పర్వం కొనసాగుతూనే ఉంది. ఏడేళ్ల క్రితం నమోదు చేసిన కేసులో కొన్ని రోజుల క్రితం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు సీదిరి అప్పలరాజు హాజరైన సంగతి తెలిసిందే. అయితే మరొకసారి సీదిరి అప్పలరాజును విచారణకు రమ్మనడంతో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య బహిర్గతమైంది
నాలుగురోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరైన అప్పలరాజును.. మరో కేసులో మళ్లీ విచారణకు రావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేశారు. దాంతో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు సీదిరి అప్పలరాజు. శనివారం సుమారు ఏడుగంటల పాటు అప్పలరాజును పోలీసులు విచారించారు. మళ్లీ అప్పలరాజు విచారణకు హాజరు కావడంతో పీఎస్ వద్దకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.


