నేటి పక్షి.. నాటి రాకాసి బల్లి : ఫలించిన ముగ్గురు శాస్త్రవేత్తల అన్వేషణ

Scientists Identifying Dinosaurs Evolution  - Sakshi

డైనోసర్ల పరిణామక్రమం గుర్తింపు    

 ముగ్గురు శాస్త్రవేత్తల అధ్యయనంలో ఆసక్తికర అంశాలు 

 నేచర్‌ గ్రూప్‌ జర్నల్‌ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురితం  

 పరిశోధనలో భాగస్తులైన తెనాలి శాస్త్రవేత్త జీవీఆర్‌ ప్రసాద్‌

గుంటూరు: కోతి నుంచి మనిషి అవతరించాడని చెబుతారు. అలాగే ఇప్పటి పక్షుల పూర్వీకులు ఆనాటి రాకాసి బల్లులేనట!  సరీసృపాల స్వర్ణయుగంగా పేరొందిన క్రిటేయస్‌ (దాదాపు వంద మిలియన్‌ ఏళ్లకు పూర్వం)నాటి టైటనోసారిక్‌ డైనోసర్ల శిలాజీకరణం చెందిన లోపభూయిష్టమైన గుడ్లను వాటి గూళ్లను కనిపెట్టి అధ్యయనం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం తేలి్చన సారాంశమిది. 

డైనోసార్ల పునరుత్పత్తి జీవశాస్త్రంపై వీరి పరిశోధనపత్రం గత వారం నేచర్‌ గ్రూప్‌ జర్నల్‌ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురితమైంది. వీరిలో ఒకరు తెనాలికి చెందిన పాలీయాంథాలజీ శాస్త్రవేత్త డాక్టర్‌ గుంటుపల్లి వీఆర్‌ ప్రసాద్‌ కావటం విశేషం. వీఆర్‌ ప్రసాద్‌ ఢిల్లీలోని యూనివర్శిటీ ఆఫ్‌ ఢిల్లీ భౌగోళిక విభాగం అధిపతి. పూర్వ చారిత్రాత్మక కాలం (మెసాజోయిక్‌  ఎరా)లో భారతదేశంలోని సకశేరుక జంతుజాలం పరిణామక్రమం, జీవవైవిధ్యం, ప్రకృతి, వాతావరణంలో మార్పులను ఆయన 40 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు. 

ఈ అన్వేషణలో కనుగొన్న అంశాలు శాస్త్రపరిశోధన రంగాన్ని అబ్బుర పరిచాయి. 2016లో డైనోసర్లను పోలిన 150 మిలియన్‌ ఏళ్లకు చెందిన సముద్ర సరీసృపంను గుజరాత్‌లోని కచ్‌ తీరంలో వీఆర్‌ ప్రసాద్‌ గుర్తించారు. 1988లో క్రిటిíÙయస్‌ యుగంలో నివసించిన క్షీరదాల ఉనికిని దక్కన్‌ పీఠ భూమిలో గుర్తించి, వాటి పుట్టుక భారత్‌లోనే నని శాస్త్రలోకానికి చాటారు. తన విజయాలకు గాను 2019లో భారత ప్రభుత్వంచే ‘జాతీయ ఉత్తమ శాస్త్రవేత్త’ అవార్డును స్వీకరించారు.  


టైటనోసారిక్‌ డైనోసార్ల గూడు, గుడ్లు శిలాజాల మైక్రోస్కోపిక్‌ ఫీల్డ్‌ ఫొటోలు 

ఫలించిన ముగ్గురు శాస్త్రవేత్తల అన్వేషణ
భారతదేశంలోని మధ్య, పశి్చమ ప్రాంతాల్లో టైటనోసారిక్‌ డైనోసర్ల గూళ్లలో శిలాజీకరణం చెందిన లోపభూయిష్టమైన గుడ్లను హర్ష ధిమాన్, విశాల్‌ వర్మతో కలిసి గుంటుపల్లి వీఆర్‌ ప్రసాద్‌ గుర్తించారు. గుడ్డు లోపల ఇంకో గుడ్డు ఉండటం లేదా గుడ్డును ఆవరించి ఉండే పెంకు ఎక్కువ పొరల్లో ఉండటాన్ని లోపభూయిష్టమైనవిగా చెబుతారు. వీటిని మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాకు చెందిన పడ్లియా గ్రామంలో కనుగొన్నారు. మరికొన్నిటిని గుజరాత్‌ రాష్ట్రంలో గుర్తించారు. పరిశోధనల అనంతరం ఈ శిలాజ అవశేషాలను పడ్లియా సమీపంలోని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ డైనోసర్‌ శిలాజ జాతీయ పార్కులో భద్రపరిచారు.  

ఆధార సహితంగా నిర్ధారణ
పక్షుల పూరీ్వకులు రాకాసి బల్లులేనని వీఆర్‌ ప్రసాద్‌ బృందం ఆధార సహితంగా నిర్ధారించింది. జీవుల్లో లోపభూయిష్ట గుడ్లు ఏర్పడడానికి అనేక కారణాలుంటాయి. దేహరుగ్మతలు, అధిక జనసాంద్రత, ఆహార కొరత, వరదలు, కరువుకాటకాలు, వాతావరణ మార్పులు వంటివి ప్రధానమైనవి.  గుడ్డులో గుడ్డు ఉండడాన్ని పక్షుల విషయంలో అప్పుడప్పుడు వింటుంటాం. అలాగే అనేక పొరల పెంకుతో గుడ్లు ఏర్పడటం కూడా సరీసృపాలు, పక్షుల్లో కనిపిస్తోంది. ఈ రెండు అంశాల ఆధారంగా  డైనోసర్లు పక్షుల పూర్వీకులనే విషయాన్ని వీఆర్‌ ప్రసాద్‌ బృందం స్పష్టం చేసింది. డైనోసర్ల పరిణామక్రమంపై పరిశోధన ప్రథమంగా మన దేశంలో జరగటం, ఇందులో తెలుగు శాస్త్రవేత్త పాలుపంచుకోవటం విశేషం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top