లంచమడిగితే వెంటనే చర్యలు

Sameer Sharma Comments On ACB 14400 APP Andhra Pradesh Govt - Sakshi

‘ఏసీబీ 14400’ యాప్‌లో స్పెషల్‌ ఫీచర్లు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ

సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వ అధికారి లంచం అడిగినా ‘ఏసీబీ 14400 యాప్‌’ ద్వారా ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ చెప్పారు. మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్‌ నుంచి ఏసీబీ 14400 కాల్‌ సర్వీసులు, దానిపై రూపొందించిన యాప్‌పై వీడియో సమావేశం ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీనిపై విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ యాప్‌ను ప్రజలు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ యాప్‌లో లైవ్‌ రికార్డు ఆడియో, ఫొటో లేదా వీడియో సౌకర్యం వంటి ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయని వివరించారు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు వీలైన సౌకర్యం ఇందులో ఉందని తెలిపారు. ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత మొబైల్‌కు ఆ ఫిర్యాదుకు సంబంధించిన రిఫరెన్స్‌ వస్తుందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top