గుంటూరులో వైఎస్సార్‌ ఫుడ్‌బ్యాంక్‌

Sajjala Ramakrishna Reddy Opens YSR Food Bank in Guntur - Sakshi

ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు నగరపాలకసంస్థ స్థానిక గాంధీపార్క్‌ కూడలిలో వైఎస్సార్‌ ఫుడ్‌ బ్యాంక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి, ఆహారం అధికంగా ఉన్నవారికి వార«ధిగా నిలిచే పుణ్యకార్యక్రమం ‘వైఎస్సార్‌ ఫుడ్‌ బ్యాంక్‌’ అని చెప్పారు. నగరపాలక సంస్థ మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఆకలితో బాధపడేవారులేని నగరంగా గుంటూరు మారాలని ఆకాంక్షించారు.

మనం వృధా చేస్తున్న ఆహారాన్ని ఇకమీదట ఫుడ్‌బ్యాంక్‌లో ఉంచడం వల్ల ఎందరో అభాగ్యులకు ఆకలి తీరుతుందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రమంతటా ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్‌ అనూరాధ, ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మ«ధుసూధన్‌రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top