సాక్షి,విజయవాడ: పచ్చపార్టీ కుట్రలు విఫలమయ్యాయి. ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలు బట్టబయలయ్యాయి. జావా డిస్కవర్ ఛానల్‌లో తప్పుడు కథనాలు ప్రసారమయ్యాయి. ‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీని మార్చి, వక్రీకరించి జావా డిస్కవరీ ప్రసారం చేసింది.
2021లో ‘బ్లడ్ శాండర్స్’ పేరుతో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్ కిల్లర్స్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించబడింది. అయితే తాను చెప్పని, పుస్తకంలో లేని అంశాలను జావా డిస్కవరీ ప్రస్తావించడంపై ఉడుముల సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థపై లీగల్ చర్యలు తీసుకుంటానని ఆయన ట్వీట్ చేశారు.
‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీ వెనుక ఎల్లో బ్యాచ్ ఉన్నట్లు బయటపడింది. అసలు రచయితే డాక్యుమెంటరీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీడీపీ కుట్రలు వెలుగులోకి వచ్చాయి.
Misleading Pictures and false linkage used in ‘tweaked’ edition of Planet Killers documentary
I want to clarify a few important points regarding the planet killers documentary which extensively used the contents in my book ‘Blood Sanders’.
First English documentary version…— Sudhakar Udumula (@sudhakarudumula) May 6, 2026


