ఏపీకి అలర్ట్‌.. మరో 3 రోజులు వర్షాలు

Rains In Ap For Another 3 Days - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం మధ్య బంగాళాఖాతం వైపునకు కదలింది.  దీని ప్రభావంతో మరో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ  తెలిపింది.  గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గా­లులు వీస్తాయని తెలిపింది.

గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏ­లూ­రు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు. బుధవారం విజయనగరం జిల్లా సా­రధిలో 9.8  సెం.మీ. అత్యధిక వర్షపాతం న­మో­దైంది.
చదవండి: దిగివచ్చిన కేంద్రం.. ఫలించిన సీఎం జగన్‌ ఒత్తిడి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top