బంగాళాఖాతంలో అల్పపీడనం | Rain for the next three days in ap | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో అల్పపీడనం

Jul 3 2026 3:25 AM | Updated on Jul 3 2026 11:47 AM

Rain for the next three days in ap

రానున్న మూడు రోజులు వర్షాలు

సాక్షి, అమరావతి: వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి­నట్లు వాతావరణ శాఖ గురువారం తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకా­శం ఉందని పేర్కొంది. 

తీరం వెంబడి గంటకు 40, 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ­కాశం ఉందని తెలిపింది. శుక్రవారం శ్రీకా­కు­ళం, పోలవరం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన­సీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని­చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మో­స్త­రు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలిక­పా­టి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement