అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. హింసాత్మకంగా కోనసీమ సాధన సమితి ఆందోళనలు

Protest Against Not To Change Original Name of Konaseema District - Sakshi

సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

అయితే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్ల దాడిచేశారు. ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

అంబేద్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదు: హోంమంత్రి
అమలాపురంలో అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. దీని వెనుక ఉన్న టీడీపీ, జనసేన పార్టీలున్నాయన్న అనుమానం ఉందన్నారు. అంబేద్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదని, కోనసీమ ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ పేరు పెట్టామని అన్నారు.

చదవండి: MLC Ananta Babu Case: చట్టం ముందు ఎవరైనా ఒక్కటే: సజ్జల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top