ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు | Private Travels Bus Catches Fire Near Vijayawada Bus Stand | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు

Apr 1 2026 5:35 AM | Updated on Apr 1 2026 5:35 AM

Private Travels Bus Catches Fire Near Vijayawada Bus Stand

ప్రయాణికులు సురక్షితం.. విజయవాడలో ఘటన  

కృష్ణలంక (విజయవాడ తూర్పు): విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సాయి ఆర్‌కే ట్రావెల్స్‌ బస్సు సోమవారం సాయంత్రం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో విజయవాడ బస్టాండ్‌ సమీపానికి చేరుకోగానే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బ్యాటరీ టెరి్మనల్స్‌ వద్ద మంటలు చెలరేగాయి.

క్షణాల్లోనే మంటలు బస్సులోకి వ్యాపించి పొగ దట్టంగా కమ్మేసింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్‌ ప్రయాణికులను కిందకు దించేశారు. సమీపంలోనే ఉన్న ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేశారు. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే, బస్సులో మంటలు చేలరేగుతుండగా... హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ బస్సులో చెప్పులు మర్చిపోయానని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి  తెచ్చుకోవడంతో అంతా ఆందోళన చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement