Andhra Pradesh Govt Orders Issued Dearness Allowance Increase Govt Pensioners - Sakshi
Sakshi News home page

3.144 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు

Jul 31 2021 7:15 PM | Updated on Aug 1 2021 9:08 AM

Orders Issued On DA Increase Of Govt Pensioners In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్‌ చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. 2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్టు ఆర్ధిక శాఖ తెలిపింది. 2018 జూలై 1వ తేదీన 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి 5.24 శాతం మేర మూడో డీఆర్ పెంపుదల చేశారు. ఈ పెంపుతో 38.776 శాతానికి పింఛన్‌దారుల డీఏ పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement