డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ నియామకానికి నోటిఫికేషన్‌

Notification For Appointment Of Dr YSR Health University VC - Sakshi

దరఖాస్తు దాఖలుకు గడువు 31వ తేదీ

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ (వీసీ) నియామకం కోసం సోమవారం రిజిస్ట్రార్‌ (ఎఫ్‌ఏసీ) డాక్టర్‌ సీహెచ్‌.శ్రీనివాసరావు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారాన్ని అందుబాటులో ఉంచారు. అర్హులైన వైద్యులు దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి సమర్పించాలి. ఈ నెల 31వ తేదీ సాయంత్రం ఐదుగంటల వరకు దరఖాస్తులు అందజేయవచ్చు.

వీసీ ఎంపికకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సెర్చ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. గవర్నర్‌ నామినేట్‌ చేసిన విశ్వభారతి వైద్య కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ గజ్జల వీరాంజిరెడ్డి, విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నామినేట్‌ చేసిన శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్, వీసీ డాక్టర్‌ వెంగమాంబ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత వీసీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ పదవీకాలం ఈ నెల 12వ తేదీతో ముగియనుంది.

ఇదీ చదవండి: AP: ఫ్యామిలీ డాక్టర్‌.. సరికొత్త ‘జీవన శైలి’

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top