వైఎస్సార్‌సీపీ నేత బిరదవోలు అక్రమ అరెస్టు | Nellore Police Arrest biradavolu srikanth reddy In Hyderabad | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత బిరదవోలు అక్రమ అరెస్టు

Jul 21 2025 6:14 PM | Updated on Jul 21 2025 6:56 PM

Nellore Police Arrest biradavolu srikanth reddy In Hyderabad

నెల్లూరు: వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది.  అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో వైఎస్సార్‌సీపీ నేతల్ని వేధింపులకు గురి చేస్తోంది. నెల్లూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి అక్రమ కేసులో అరెస్ట్‌ చేశారు.  ఈరోజు (సోమవారం, జూలై 21)బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు నెల్లూరు పోలీసులు.  

పోలీసుల తీరుపై శ్రీకాంత్‌రెడ్డి భార్య ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం గం. 12.30 ని.లకు ఏ సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని, సాయంత్రం గం. 4.15 ని.లకు అరెస్ట్‌ చేశామని మెసేజ్‌ పెట్టారని విమర్శించారు. పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో శ్రీకాంత్‌రెడ్డిని అక్రమ అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్ లో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement