భేటీ ఫలప్రదం: ఎంపీ విజయసాయిరెడ్డి

MP Vijayasai Reddy Thanked PM Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ఫలప్రదంగా జరిగిందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని తెలిపారని ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం పట్ల ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీకి విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఆ అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌దే: షెకావత్‌)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సమావేశం దాదాపు 50 నిమిషాల పాటు నిమిషాల పాటు జరిగింది. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top