ముంపు ప్రాంతాల్లో క‌న్న‌బాబు ప‌ర్య‌ట‌న‌ | Minister Kannababu Visited Flood Prone Areas In Kakinada | Sakshi
Sakshi News home page

వ‌ర‌ద‌లు త‌గ్గిన త‌ర్వాత అక్ర‌మ కట్ట‌డాల‌పై ఉక్కుపాదం

Oct 15 2020 3:33 PM | Updated on Oct 15 2020 3:59 PM

Minister Kannababu Visited Flood Prone Areas In Kakinada  - Sakshi

సాక్షి, కాకినాడ : భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతు కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పార‌ని వ్య‌వ‌సాయశాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. కాకినాడ రూరల్ ఎఫ్.సి.ఐ కాలనీ,జన చైతన్య నగర్ ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ఆయ‌న వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు సీఎం అడిగి తెలుసుకొని స‌మీక్షిస్తున్న‌ట్లు తెలిపారు. కాకినాడ రూర‌ల్‌లో 40 కాల‌నీలు ముంపుకు గుర‌య్య‌య‌ని, దాదాపు 70 వేల మంది ముంపులో జీవిస్తున్నారు. రిజర్వాయర్ల నుండి విడుదలైన వరద నీరు, భారీ వర్షాల కారణంగా జిల్లా తీవ్రంగా దెబ్బతిందని, వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం  జ‌రిగింది. వ్యవసాయ, ఉద్యానవన పంటల నష్టం అంచనాలను రూపొందించేందుకు బృందాలను ఏర్పాటు చేశాం. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో మేజర్, మైనర్ డ్రైయిన్ లలో వరద నీరు అధికంగా ప్రవహించడం వల్ల ముంపు సమస్య వచ్చిందని, వరదలు తగ్గిన తరువాత డ్రైయిన్ ఆక్రమణల తొలగింపుపై క‌ఠిన  చర్యలు తీసుకుంటాం అని మంత్రి పేర్కొన్నారు. (ఏపీలో పంట నష్టం అంచనాను ప్రారంభించిన ప్రభుత్వం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement