'గౌతమ్ బాబు చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారు' | Mekapati Rajamohan Reddy Comments on Atmakur Bypoll | Sakshi
Sakshi News home page

'గౌతమ్ బాబు చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారు'

May 31 2022 8:44 PM | Updated on May 31 2022 9:46 PM

Mekapati Rajamohan Reddy Comments on Atmakur Bypoll - Sakshi

సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉపఎన్నికకు జూన్‌ 2న నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబంలో అనుకోని విషాదం జరిగింది. విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు నుంచి పోటీకి నిలబెట్టాం. గౌతమ్ బాబు చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారు అని మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి అన్నారు. 

ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్‌ అన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజల ఆశీర్వాదం ఉంది. ప్రభుత్వానికి పూర్తి ఆదరణ ఉంది. సీఎంకి ఉన్న జనాదరణ, గౌతమ్‌ అన్నపై ఉన్న అశేష అభిమానం భారీ విజయానికి సోపానాలు కానున్నాయని విక్రమ్‌రెడ్డి తెలిపారు. 

చదవండి: (2019లో బాలకృష్ణ కూడా తొడలు కొట్టాడు.. ఏమైంది..?: మంత్రి జోగి రమేష్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement